Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనిశాకు చిక్కిన పురపాలక ఉద్యోగి


పట్టుబడిన నగదుతో ఆంజనేయులు

 

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఇంటి పన్ను పత్రాల్లో పేరుమార్పునకు లంచం డిమాండ్‌ చేసిన భీమవరం పురపాలక ఉద్యోగి శుక్రవారం నగదు తీసుకొంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. ఇంటి పన్నులో పేరు మార్చాలని భీమవరం 6వ వార్డుకు చెందిన గూడూరి శ్రీనివాస్‌ 2019లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ వార్డుకు బిల్లు కలెక్టరుగా పనిచేసిన పి.ఆంజనేయులు(ప్రస్తుతం ఆయన మరో వార్డుకు అడ్మిన్‌గా వ్యవహరిస్తున్నారు) పేరు మార్పునకు రూ.3 వేల లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు అనిశా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో పురపాలక రెవెన్యూ విభాగంలో రూ.1500 నగదును బాధితుడు నేరుగా ఆంజనేయులుకు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. దాడిలో సీఐలు ఎం.రవీంద్ర, కె.శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు ఆంజనేయులు విధులు నిర్వహించిన వార్డుల్లో అపరిష్కృత దస్త్రాలు, తిరస్కరణలపై అనిశా అధికారులు ఆరా తీశారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కంప్యూటర్‌లో వివరాలు, దస్త్రాలను పరిశీలించారు.

ఏళ్ల తరబడి జాప్యం: ‘ఇంటి పన్నులో పేరు మార్చాలని కొన్నేళ్లుగా ఆ ఉద్యోగి చుట్టూ తిరుగుతున్నా. గతంలో రూ.5 వేల వరకు ఇచ్చాను. లాగిన్‌ కావడం లేదని, దస్త్రాల్లో మార్పులకు ఖర్చు అవుతుందంటూ నగదు డిమాండ్‌ చేస్తుండేవారు. ఇటీవల కాలంలో నిత్యం కార్యాలయానికి వెళ్తున్నా సమాధానం చెప్పకపోగా మళ్లీ లంచం అడగడంతో అనిశా అధికారులను ఆశ్రయించాను’ అని గూడూరు శ్రీనివాస్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని