Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: వేసవిలో నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని సీఎండీ కార్యాలయ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజ బాపయ్య అన్నారు. ఏపీఈపీడీసీఎల్‌, ట్రాన్స్‌ కో అధికారులతో శుక్రవారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి విద్యుత్తు ఎస్‌ఈ జనార్దనరావు, డీఈలు నారాయణ అప్పారావు, శ్యామ్‌బాబు, పీర్‌ అహ్మద్‌, సురేష్‌ బాబు, వీరభద్రరావు, అంబేడ్కర్‌ తదితరులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు వినియోగం పెరుగుతుండటంతో అక్కడ సరఫరా కొన్ని సమయాల్లో నిలిపి వేసి హెచ్చుతగ్గులను సరి చేస్తున్నారని, ఇలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని