Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘నన్నయ’లో ఏకలవ్య ప్రారంభం

రాజానగరం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన ‘ఏకలవ్య’ కార్యక్రమాన్ని నన్నయ విశ్వవిద్యాలయంలో వీసీ ఆచార్య ఎం.జగన్నాథరావు శుక్రవారం ప్రారంభించారు. ఇందుకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ఎక్కువమంది ఉన్నారని, వీరిలో స్పోకెన్‌ ఇంగ్లిషు, కంప్యూటర్‌ నైపుణ్యం పెంపొందేలా ‘ఏకలవ్య’ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఇందులో విద్యార్థులకు మూడు వారాల శిక్షణ అందిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్‌గా వి.పెర్సిస్‌, కో ఆర్డినేటర్లుగా బి.బి.అహ్మద్‌ ఆలీబాబా, డి.దాసు వ్యవహరిస్తారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని