Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేషన్‌ సమస్యలా?

నేడు ‘డయల్‌ యువర్‌ డీఎస్‌వో’

● ఫోన్‌ చేయాల్సిన తేదీ: 17.4.21 (శనివారం)

● సమయం: ఉదయం 11 నుంచి 12 గంటల వరకు

● ఫోన్‌ నంబరు: 63033 00743

సుబ్బరాజు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో రేషన్‌ సరకుల పంపిణీకి సంబంధించి కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ /వార్డు సచివాలయాల వాలంటీర్లు రేషన్‌ పంపిణీ వాహన సమాచారం తెలియజేయడం లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. బియ్యం కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి, తొలగించడానికి, కొత్త కార్డులు పొందడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. రేషన్‌ కార్డులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ‘డయల్‌ యువర్‌ డీఎస్‌వో’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సమస్యలే కాకుండా పెట్రోలు బంకుల్లో కల్తీలు, కొలతల్లో తేడాలపై ఫోనుచేసి తెలియజేయవచ్ఛు ఆయా సమస్యలకు జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారి (డీఎస్‌వో) ఎన్‌.సుబ్బరాజు సమాధానాలు ఇవ్వడంతో పాటు పరిష్కారానికి చర్యలు చేపడతారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని