Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రంగస్థల కళాకారులను ఆదుకోండి


‘నాన్నా - నన్ను క్షమించకండి’ నాటికలో సన్నివేశం

 

గునుపూడి (భీమవరం సాంస్కృతికం), న్యూస్‌టుడే: రంగ స్థల కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ సాంస్కృతిక, నాటక పరిషత్‌ల సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకటరామారావు (తాడేపల్లిగూడెం) కోరారు. భీమవరంలో పంచారామక్షేత్రం సోమేశ్వరజనార్దనస్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై కళారంజని నాటక అకాడమీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ‘నాన్నా - నన్ను క్షమించకండి’, ‘కుల క్షేత్రం’ నాటికలు ప్రదర్శించారు. అకాడమీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వై.వెంకటరమణ, అధ్యక్షుడు జవ్వాది దాశరథి శ్రీనివాసరావు, కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, సభ్యులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని