Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మతోన్మాద రాజకీయాలను ఓడించడానికే మేడే వారోత్సవాలు


మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

 

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించడానికే కేంద్ర ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలను ప్రచారం చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ మేరకు సీఐటీయూ జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.సోమయ్య అధ్యక్షతన స్థానిక అల్లూరు సత్యనారాయణ భవనంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికవర్గ ఐక్యతకు ముప్పుగా ఉన్న మతోన్మాద రాజకీయాలను ఓడించడానికి మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌, నాయకులు చింతకాయల బాబూరావు, లింజరాజు, నాగేశ్వరరావు, రంగారావు, భారతి, పోశమ్మ, శ్యామలారాణి, విజయలక్ష్మి, దొర, సుందరబాబు, వెంకట్రావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని