Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఔత్సాహికులను ప్రోత్సహించండి: కలెక్టర్‌


దస్త్రాలు పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం నూతన జనరల్‌ మేనేజరుగా (జీఎం) నియమితులైన ఆర్‌.వెంకటరావు కలెక్టర్‌ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు మాట్లాడుతూ వివిధరకాల పరిశ్రమలను స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పారు. ఇప్పటివరకు జిల్లా పరిశ్రమల కేంద్రం ఇన్‌ఛార్జి జీఎంగా ఉన్న పి.ఏసుదాసు నుంచి జీఎంగా వెంకటరావు బాధ్యతలు తీసుకున్నారు. ఈయన విజయవాడలోని డీఐసీలో ఉప సంచాలకునిగా పనిచేస్తూ పదోన్నతిపై జీఎంగా జిల్లాకు విచ్చేశారు. వెంకటరావు 2003 నుంచి 2005 వరకు డీఆర్‌డీఏలో ఏపీడీగా పనిచేశారు. 2012 నుంచి 2014 వరకు డీఐసీలో ఉప సంచాలకునిగా విధులు నిర్వహించారు.

ప్రభుత్వాసుపత్రిలో దస్త్రాల పరిశీలన

చింతలపూడి గ్రామీణ, న్యూస్‌టుడే : చింతలపూడి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు యర్రగుంటపల్లి, రాఘవాపురం పీహెచ్‌సీలలో సీఐడీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. గతంలో ఆయా ఆసుపత్రులకు ప్రభుత్వం సరఫరా చేసిన వైద్య పరికరాల కొనుగోలు సందర్భంగా పాటించిన నియమ, నిబంధనలతో పాటు వైద్య పరికరాల కొనుగోలుకు అయిన ఖర్చు తదితర అంశాలను పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని