Published : 17/04/2021 06:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడు రోజులు బావిలోనే!

మూగజీవికి నరకయాత

బావిలో ఇరుక్కున్న గేదె

 

ఆకివీడు, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన గేదె మూడు రోజుల పాటు దానిలోనే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించి చివరకు ప్రాణాలతో బయటపడింది. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది కథనం ప్రకారం.. అజ్జమూరు గ్రామానికి చెందిన బొంగ ప్రభుదాసుకు చెందిన గేదె బుధవారం నుంచి కనిపించడం లేదు. ఆకివీడు జానకీనగర్‌ ప్రాంతంలో వెంకయ్యవయ్యేరు నుంచి నీటిని మళ్లించుకునేందుకు ఏర్పాటు చేసిన చిన్న బావిలో అది పడిపోయినట్లు స్థానికులు శుక్రవారం గుర్తించి అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది అక్కడికి చేరుకుని జేసీబీతో బావి చుట్టూ తవ్వించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి ఆ గేదెను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం పశుసంవర్థకశాక ఏడీ సత్యనారాయణ పర్యవేక్షణలో దానికి చికిత్స చేశారు. బావి పైకప్పు సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

వెలికితీసే యత్నాల్లో అగ్నిమాపక సిబ్బంది

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని