Published : 17/04/2021 06:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్పాట్‌ బిల్లింగ్‌ టెండర్ల పరిశీలన

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖలో స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్ట్‌లకోసం నిర్వహించిన టెండర్లను శుక్రవారం పరిశీలించారు. ఏలూరులోని విద్యుత్తు సర్కిల్‌ కార్యాలయంలో ఎస్‌ఈ జనార్దనరావు ఆన్‌లైనులో టెండర్లను ఓపెన్‌ చేశారు. స్పాట్‌ బిల్లింగ్‌ టెండర్లను దక్కించుకునేందుకు పలువురు కాంట్రాక్టర్లు తీవ్ర పోటీ పడుతున్నారు. ఎప్పుడూలేని విధంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచే కాక తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొంతమంది కాంట్రాక్టర్లు టెండర్ల బిడ్‌లను దాఖలు చేశారు. ఈసారి టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఉన్నతాధికారులు గట్టి నిర్ణయం తీసుకోవటంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్లు, బినామీలతో నడుపుతున్న వారు, విజిలెన్సు ఆరోపణలు ఎదుర్కొన్న వారి బిడ్‌లను బ్లాక్‌ లిస్టులో పెట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారని సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని