Published : 17/04/2021 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

దెందులూరు: మండలంలో బుధవారం వీచిన ఈదురు గాలులు, అకాల వర్షానికి పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శనివారం పరిశీలించారు. రామారావుగూడెంలోని మొక్కజొన్న, ఆయిల్ పామ్, అరటి పంటలను పరిశీలించారు. మల్కచర్ల, నరసింహాపురం గ్రామాల్లో వరి పంటను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని