ఆసుపత్రికి వెళ్తూ కుప్పకూలి..
logo
Published : 09/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రికి వెళ్తూ కుప్పకూలి..

విశాఖపట్నం (గోపాలపట్నం), న్యూస్‌టుడే : తీవ్ర అస్వస్థతతో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం విశాఖలోని గోపాలపట్నంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.... నిడమర్రు మండలం బావయ్యపాలెం పరిధి బీసీపేట ప్రాంతానికి చెందిన శెట్టి గంగరాజు (38) మహా విశాఖనగర పాలక సంస్థలో వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తూ నరవలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఆసుపత్రికి వెళ్లేందుకు బయలుదేరారు. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం దరి అండర్‌పాత్‌వే బ్రిడ్జి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. అటుగా వెళ్లే వారు సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి.. విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో ఉంటున్న సోదరుడి సమాచారం అందించారు. కరోనాతోనే మృతి చెందాడని బంధువులు, పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వార్డు వైకాపా నాయకులు దొడ్డి కిరణ్, ఆళ్ల పైడిరాజు తమ సొంత నిధులు రూ.20 వేలతో అంత్యక్రియలు నిర్వహించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని