అందరికీటీకాలు వేయాలి
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరికీటీకాలు వేయాలి

జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతల దీక్షలు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని, కొవిడ్‌ టీకాలు అందరికీ వేయాలని తెదేపా నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లాలోని పలువురు నాయకులు తమ ఇళ్లు, క్యాంపు కార్యాలయాల వద్ద రెండు గంటల పాటు దీక్షలు చేపట్టారు. కరోనా బాధితులకు వైద్య సేవలందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భీమడోలులో పార్టీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, భీమవరంలో పార్టీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ మాజీ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ దుగ్గిరాలలోని తన నివాసం వద్ద, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తమ క్యాంపు కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. భీమవరంలో తెదేపా నాయకులు మెంటే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఆయా ప్రాంతాల్లో తెదేపా నాయకులు దీక్షలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని