Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.110 కోట్లతో టవర్‌ లైను నిర్మాణం

సర్వే చేస్తున్న సిబ్బంది

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు వద్ద జల విద్యుత్తు కేంద్రం నిర్మాణంలో భాగంగా రూ. 110 కోట్లతో టవర్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మేఘా కంపెనీ మేనేజర్‌ గోవిందరాజ్‌ తెలిపారు. పోలవరం తాలూకా కార్యాలయం సమీపంలో శనివారం దీనికి సంబంధించి సర్వే జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అంగుళూరు వద్ద నిర్మించే జల విద్యుత్తు కేంద్రం నుంచి విద్యుత్తు పంపిణీ కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంగుళూరు నుంచి గోపాలపురం మండలం గుడ్డిగూడెం వరకు ఈ లైను నిర్మిస్తామని తెలిపారు. 25 కిలోమీటర్ల పొడవున 75 టవర్‌లు నిర్మించాల్సి ఉందన్నారు. గుడ్డిగూడెం వద్ద 400 కేవీ విద్యుత్తు కేంద్రం నిర్మాణం జరుగుతోందని, అక్కడి నుంచి ఏపీ ట్రాన్స్‌కో సంస్థ 220, 130 కేవీ ఉప కేంద్రాలకు పంపిణీ చేస్తారన్నారు. గోదావరి నదిపై ఒక టవర్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని, వచ్చే సంవత్సరానికి లైను పూర్తి చేస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని