నిరీక్షించి.. నీరసించి..
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిరీక్షించి.. నీరసించి..

ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఎదుట బాధితుల దైన్యం

- న్యూస్‌టుడే, ఏలూరు టూటౌన్‌

ప్రాంగణంలో సొమ్మసిల్లి పడుకున్న వృద్ధురాలు

కొవిడ్‌ బాధితులకు నిరీక్షణ విషమ పరీక్ష పెడుతోంది. ఆసుపత్రుల్లో పడకలు లేక.. వైద్యసేవలు ఎప్పుడు అందుతాయో తెలియక.. నిరీక్షించి నీరసించిపోతున్నారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి, ఆశ్రం ఆసుపత్రి బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రి ప్రాంగణాల్లో బాధితులు, వారి బంధువులు పడిగాపులు పడుతున్నారు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో రావడంతో పడకలు లేక ఆసుపత్రి నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి కొవిడ్‌ విభాగం వద్ద నిత్యం రద్దీ నెలకొంటోంది. చేరేందుకు వచ్చిన వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరికొందరిని హడావుడిగా సిబ్బంది ఆసుపత్రిలో చేరుస్తున్నారు.

చక్రాల కుర్చీలోకి చేర్చుతున్న సిబ్బంది​​​​​​​


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని