హమ్మయ్యా.. ఇన్నాళ్లకు దక్కింది
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హమ్మయ్యా.. ఇన్నాళ్లకు దక్కింది

8,654 మందికి రెండో విడత వ్యాక్సినేషన్‌

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: మొదటి డోసుగా కొవాగ్జిన్‌ వేయించుకొని.. రెండో దాని కోసం ఎదురుచూసిన వారికి ఉపశమనం లభించింది. జిల్లావ్యాప్తంగా పలు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కొవాగ్జిన్‌ టీకా వేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. శనివారం మొత్తం 8,654 మంది వినియోగించుకోగా.. అందులో 8,260 మందికి కొవాగ్జిన్‌, 394 మందికి కొవిషీల్డ్‌ వేశారు. రెండో డోసువారికి మాత్రమే వేయాలనే నిబంధన ఉండటంతో.. మిగిలిన వారిని వెనక్కు పంపించారు. జిల్లా వ్యాప్తంగా చాలా కేంద్రాలకు అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది. పెద్దఎత్తున బారులు తీరారు. కొన్ని చోట్ల పోలీసులు అదుపు చేయాల్సి వచ్చింది. ఏలూరులోని గజ్జెలవారి చెరువు అర్బన్‌ పీహెచ్‌సీ వద్ద ప్రజలు ఎక్కువ మంది రావడంతో వన్‌టౌన్‌ సీఐ బాలరాజాజీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని