టీకా కేంద్రాల్లో భౌతికదూరం తప్పనిసరి : కలెక్టర్‌
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా కేంద్రాల్లో భౌతికదూరం తప్పనిసరి : కలెక్టర్‌

ఏలూరు కలెక్టరేట్‌, టూటౌన్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ టీకా కేంద్రాలకు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొవిడ్‌ పరిస్థితులపై ఉప కలెక్టర్‌, ఆర్డీవోలు, తహశీల్దార్లు, పురపాలక సంఘాల కమిషనర్లతో కలెక్టరేట్‌ నుంచి శనివారం నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు వచ్చిన కొవాగ్జిన్‌ టీకాలను రెండో డోసు వారికి మాత్రమే వేయాలని స్పష్టం చేశారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో పడకల ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అంబులెన్స్‌లో వచ్చేవారిని సత్వరమే చేర్చుకుని వైద్యసేవలు అందించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని ఆసుపత్రుల్లో సదరు పథకం ద్వారా వైద్యసేవలు అందించేందుకు తాత్కాలిక అనుమతులు పొందాలన్నారు. సమావేశంలో జేసీ (అభివృద్ధి) హిమాన్షుశుక్లా తదితరులు పాల్గొన్నారు.

అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు: ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. శనివారం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అవసరాన్ని అడ్డుపెట్టుకుని కొవిడ్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యుల వద్ద ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆసుపత్రులకు తీసుకురావాలన్నా.. మృతదేహాలకు తరలించాలన్నా కేటాయించిన ధరల మేరకే వసూలు చేయాలన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని, ఈ సమయంలో దోపిడీ చేయడం తగదన్నారు. అంబులెన్సుల నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలుతీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని ఆర్టీవో, పోలీసు శాఖల అధికారులను ఆదేశించారు.

అంబులెన్సును పరిశీలిస్తున్న రాహుల్‌ కుమార్‌ రెడ్డి

మెరుగైన సేవలందించండి

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు 108 అంబులెన్సులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని.. ఈ కష్టకాలంలో మెరుగైన సేవలందించాలని సహాయ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఆయన శనివారం 108 అంబులెన్సులను పరిశీలించారు. మినీ వెంటిలేటర్ల పనితీరు, మందుల కిట్లను పరిశీలించారు. రికార్డులను చూశారు. రోజుకు ఒక్కో అంబులెన్సులో ఎన్ని కేసులు తరలిస్తున్నారు.. ఏయే ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నాయనేది తెలుసుకున్నారు. ఆయన వెంట అంబులెన్సుల జిల్లా మేనేజర్‌ గణేష్‌ ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని