ఘనంగా శ్రీవారి చక్రస్నానం
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘనంగా శ్రీవారి చక్రస్నానం

చందన లేపనంతో ఉత్సవమూర్తులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయమైన లక్ష్మీపురంలోని శ్రీసంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం ఆలయ ఆవరణలో స్వామివారికి చక్రస్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయ అర్చకులు, పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ ఈ వేడుక జరిపించారు. ముందుగా ఆలయాన్ని, పరిసరాలను మామిడి తోరణాలు, పూలతో శోభాయమానంగా అలంకరించారు. అర్చకులు స్వామి, అమ్మవార్లకు స్నపన, అనంతరం చక్రస్నానం, పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో ధ్వజావరోహణ, ప్రత్యేక పూజలు జరిగాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని