రూ.25 లక్షల విలువైన గుట్కా పట్టివేత
logo
Published : 19/06/2021 02:38 IST

రూ.25 లక్షల విలువైన గుట్కా పట్టివేత

పెట్టెల్లో నిల్వలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలో సుమారు రూ.25 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైపాస్‌ రహదారి శ్రీనివాసపురం కూడలికి సమీపంలోని ఒక గోదాములో దాచి ఉంచిన నిల్వలను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు గుర్తించారు. వీటిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పట్టణానికి చెందిన దూబగుంట్ల పూర్ణచంద్‌ అనే వ్యాపారి వీటిని నిల్వ చేసినట్లు గుర్తించామని ఎస్‌ఐ ఆనంద్‌రెడ్డి తెలిపారు. విచారించి కేసు నమోదు చేస్తామన్నారు. ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసిన గుట్కా ప్యాకెట్లను బిస్కెట్‌ ప్యాకెట్ల మాటున దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. పూర్ణచంద్‌ సాయిరామ్‌ ఏజెన్సీ పేరుతో బిస్కట్ల వ్యాపారం చేస్తుంటారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇతని నుంచి పెద్దఎత్తున గుట్కా ప్యాకెట్లను జంగారెడ్డిగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని