భార్య పెళ్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య
logo
Published : 19/06/2021 02:38 IST

భార్య పెళ్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య

తన చావుకు తప్పుడు కేసులు, వేధింపులే కారణమని లేఖ

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: భార్య పెళ్లి చీరతో ఉరేసుకొని భర్త మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ ఆనంద్‌రెడ్డి కథనం మేరకు.. వేగవరానికి చెందిన కడలి రామదుర్గాప్రసాద్‌(31)కు వేలివెన్ను గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. నాగలక్ష్మి ఉపాధ్యాయిని. వీరి మధ్య మనస్పర్థలొచ్చాయి. భార్య వేధింపుల కేసు పెట్టడంతో రామదుర్గాప్రసాద్‌ అరెస్టయి జైలుకు వెళ్లారు. బెయిల్‌పై వచ్చి వేగవరంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ తల్లి, సోదరులతో కలిసి ఉంటున్నారు. భార్యతో మనస్పర్థలు తొలగకపోవడం, కుమార్తెను చూడనివ్వకపోవడంతో మనస్తాపం చెంది రామదుర్గాప్రసాద్‌ తన ఇంట్లో ఉరేసుకున్నారు. తన చావుకు భార్యతో పాటు ఆమె సోదరుడు, తోడల్లుడు సహా ఆరుగురు కారణమంటూ లేఖ రాశారు. తన కుమార్తెను చూడనివ్వడం లేదని, తప్పుడు కేసులు పెట్టారని, మనోవ్యధకు గురిచేశారని లేఖలో పేర్కొన్నారు. రామదుర్గాప్రసాద్‌ వాంగ్మూలంలో పేర్కొన్న అందరిపైనా కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ ఆనంద్‌రెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని