ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు చర్యలు
logo
Published : 19/06/2021 02:38 IST

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు చర్యలు

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. ఎయిడెడ్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏప్రిల్‌ 19 వరకు ఉన్న విద్యార్థుల వివరాలను శనివారంలోగా పంపాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో 1:40 నిష్పత్తిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. అనంతరం మిగిలిన ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు కేటాయిస్తారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాలకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హేతుబద్ధీకరణ ప్రక్రియ అనంతరం దాన్ని చేపట్టే అవకాశం ఉంది. జిల్లాలోని ఎయిడెడ్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయుల వివరాలను శనివారం సాయంత్రంలోగా పంపాలంటూ ఆయా పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యాశాఖ ద్వారా లేఖలు పంపారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టి దాదాపు 19 ఏళ్లు కావస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని