అంబులెన్స్‌లో ప్రసవం
logo
Published : 19/06/2021 02:38 IST

అంబులెన్స్‌లో ప్రసవం

తల్లీబిడ్డలతో వైద్య సిబ్బంది

జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: పురిటినొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌లో ప్రసవించిన సంఘటన శుక్రవారం జరిగింది. జంగారెడ్డిగూడేనికి చెందిన టి.దుర్గాభవాని ప్రసవం కోసం జీలుగుమిల్లి మండలం పాకలగూడెంలోని పుట్టింటికి వచ్చింది. మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో 108 వాహన సిబ్బందికి సమాచారమిచ్చారు. అందులో జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో శ్రీనివాసపురం వద్ద నొప్పులు అధికమవడంతో ఈఎంటీ ఎల్‌.వీరపుల్లారావు, పైలెట్‌ బి.సతీష్‌, ఆశా కార్యకర్త నాగమణి వాహనంలోనే ఆమెకు ప్రసవం చేశారు. ఆడశిశువుకు జన్మనివ్వగా తల్లీ బిడ్డను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని