గిట్టుబాటు ధర లేక.. ఖర్చులూ రాక..
logo
Published : 19/06/2021 02:38 IST

గిట్టుబాటు ధర లేక.. ఖర్చులూ రాక..

బస్టాండ్‌లో నిమ్మకాయలను పోసి నిరసన తెలుపుతున్న రైతులు

నల్లజర్ల, ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: గిట్టుబాటు ధర లేకపోవడంతో కోసిన నిమ్మకాయలను రైతులు శుక్రవారం నల్లజర్ల మండలం దూబచర్ల బస్టాండులో పోసి నిరసన వ్యక్తం చేశారు. బస్తా కాయలు కోయడానికి, రవాణా ఛార్జీ కలిపి మొత్తం రూ.450 ఖర్చవుతుందని రైతులు తెలిపారు. తీరా మార్కెట్‌కు తీసుకెళ్లాక రూ.150 చేతిలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మ తోటలు ఉంచాలా? తొలగించాలా? అని ప్రశ్నించారు. వ్యాపారులు మార్కెట్‌కు నిమ్మకాయలు తీసుకురావద్దని చెబుతున్నారని వాపోయారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని