Ap Crime News: ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన దంపతులు
eenadu telugu news
Updated : 01/08/2021 16:59 IST

Ap Crime News: ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన దంపతులు

యలమంచిలి: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలో దూకి దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన భార్యాభర్తలు సతీశ్‌, సంధ్య, వారి పిల్లలు జశ్విన్(4), బిందుశ్రీ (2)గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని