చేయి కోసుకుని భక్తుడి వీరంగం
eenadu telugu news
Published : 18/10/2021 02:43 IST

చేయి కోసుకుని భక్తుడి వీరంగం

క్షతగాత్రుడిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న మరో భక్తుడు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చిన ఒక వ్యక్తి బ్లేడుతో చేయి కోసుకుని వీరంగం సృష్టించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఆలయ పాత నిత్య కల్యాణ మండపం ఎదురుగా ఆలయ మెట్లపై జరిగింది. అతడ్ని సెక్యూరిటీ సిబ్బంది ఆపడానికి ప్రయత్నించగా పీక కోసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో భద్రతా సిబ్బంది చాకచక్యంగా అతడ్ని పట్టుకుని బ్లేడు లాక్కొన్నారు. రక్తస్రావం కావడంతో మరో భక్తుడు అతడి చేయికి వస్త్రం చుట్టి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే బాధిత వ్యక్తి అరుపులు కేకలు వేస్తూ కాసేపు గొడవ చేశాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో అలా చేశాడా.. లేక వ్యక్తిగత గొడవల కారణంగా అలా చేసుకున్నాడా అన్నది తెలియరాలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని