బీచ్‌లో యువకుడి గల్లంతు
eenadu telugu news
Updated : 18/10/2021 06:37 IST

బీచ్‌లో యువకుడి గల్లంతు

వంశీ (పాతచిత్రం)

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యారు. ఎస్సై ఆర్‌.మల్లికార్జున రెడ్డి కథనం మేరకు.. కామవరపుకోట వీరభద్రకాలనీకి చెందిన కరిపోతి వంశీ వస్త్ర దుకాణంలో పని చేస్తారు. అదే ప్రాంతానికి చెందిన మరో ఆరుగురితో కలిసి బీచ్‌కు వచ్చారు. కొద్దిసేపు సముద్ర అలల్లో స్నానం చేశాక ఒడ్డుకు చేరారు. అనంతరం వంశీ ఒక్కడే తిరిగి సముద్రంలోకి స్నానానికి దిగి అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. అతడి ఆచూకీ కోసం ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బంది గాలిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని