రేపట్నుంచి సాధారణ వైద్యం చేరువ
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

రేపట్నుంచి సాధారణ వైద్యం చేరువ

కొవిడ్‌ సేవలు కొన్ని ఆసుపత్రులకే పరిమితం

భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిని శుభ్రం చేస్తున్న సిబ్బంది

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో సాధారణ వైద్య సేవల వైపు అధికారులు దృష్టి సారించారు. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతితో జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలు నిలిపివేశారు. ఇక్కడ సోమవారం నుంచి సాధారణ సేవలు ఆరంభించనున్నట్లు జిల్లా ఏరియా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్‌ మోహన్‌ చెప్పారు.

ఏలూరులోని జిల్లా ఆసుపత్రి, తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రి, పాలకొల్లులో కొన్ని పడకలను కొవిడ్‌ కేసులకు కేటాయించారు. మరికొన్నింటిని సాధారణ రోగుల చికిత్సలకు ఉపయోగించనున్నారు. భీమవరం, జంగారెడ్డిగూడెం, తణుకులోని ఏరియా ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవలను పూర్తిగా నిలిపి వేశారు. ఇటీవల కాలంలో డెంగీ, మలేరియా, వైరల్‌ జ్వరాలతోపాటు సీజనల్‌ వ్యాధుల విజృంభణతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లోని రోగులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం కష్టంగా మారింది. భీమవరంలో ఆసుపత్రికి పలు మండలాలకు చెందినవారే కాకుండా కృష్ణా జిల్లాకు చెందిన మండలాల్లోని గ్రామాల ప్రజలు ఇక్కడికే వస్తుంటారు. గర్భిణులు, బాలింతలు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● సాధారణ సేవలు పునఃప్రారంభిస్తున్న ఆసుపత్రులను శుభ్రం చేస్తున్నారు. మూలకు చేరిన పరికరాలను వినియోగంలోకి తీసుకొస్తున్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని