వెనుకబడితే స్థానచలనానికి సిద్ధం కండి
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

వెనుకబడితే స్థానచలనానికి సిద్ధం కండి

వ్యవసాయాధికారులతో సమీక్షలో కలెక్టర్‌

మాట్లాడుతున్న కార్తికేయమిశ్రా

 

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలాల్లో పనిచేసే సిబ్బంది లక్ష్య సాధన ఎందుకు విస్మరిస్తున్నారని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రశ్నించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు శివారు మండలమైన వేలేరుపాడులో రైతుల ఈ-కేవైసీ 97 శాతం పూర్తికాగా జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. సౌకర్యవంతమైన మండలాల్లో ఉండాలని, లక్ష్యాలను మాత్రం సాధించబోమని భావించే ఉద్యోగులు స్థాన చలనాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆర్‌బీకే సమావేశాలకు హాజరు కాకుండానే కిందిస్థాయి అధికారులు అందించిన నివేదికలను సమర్పిస్తూ సరైన వివరాలను సమర్పించకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆర్‌బీకే సమావేశాల్లో డీడీలు, ఏడీలు పాల్గొని రైతులకు అందిస్తున్న సమాచారంపై సమీక్షించాలన్నారు. పంటల మార్పిడి, విత్తనాల సేకరణ, ఎరువుల వినియోగం తదితర అంశాలపై ఆర్‌బీకే సమావేశాల్లో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు వాటి వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. రబీ సాగుపై ముందస్తు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని