వెబ్‌సైట్‌లో సీనియార్టీ జాబితాలు
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

వెబ్‌సైట్‌లో సీనియార్టీ జాబితాలు

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: పాఠశాల విద్యాశాఖ సంచాలకుని ఆదేశాల మేరకు జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయుల సర్దుబాటు నిమిత్తం సీనియార్టీ జాబితాలను www.deowg.org వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈవో సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈ నెల 24 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఏలూరులోని తమ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. ● ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల కోసం విడుదల చేసిన షెడ్యూలును అనుసరించి ఎస్‌జీటీ, తత్సమాన కేటగిరీల నుంచి ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి పొందడానికి అర్హత కలిగిన వారి వివరాలను www.deowg.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో వెల్లడించారు. సదరు జాబితాలోని ఉపాధ్యాయులు ధ్రువపత్రాల పరిశీలనకు ఈ నెల 27న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలియజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని