ధ్రువపత్రాల పరిశీలనకు 239 మంది
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

ధ్రువపత్రాల పరిశీలనకు 239 మంది

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉద్యోగోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. డీఈవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 239 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. స్కూలు అసిస్టెంట్‌ గణితం, పీఎస్‌ కేటగిరీకి సంబంధించి 253 మంది ఉపాధ్యాయులు ధ్రువపత్రాలను శనివారం పరిశీలించాల్సి ఉండగా 197 మంది హాజరయ్యారు. ఎస్‌ఏ హిందీకి సంబంధించి ఆరుగురు ఉపాధ్యాయులకు ఐదుగురు హాజరయ్యారు. ఎస్‌ఏ తెలుగుకు సంబంధించి 48కి 33 మంది హాజరయ్యారు. ఎస్‌ఏ పీడీకినలుగురికిగాను అందరూ హాజరయ్యారు. ఎస్‌ఏ ఆంగ్లం, ఎస్‌ఏ బీఎస్‌ కేటగిరీ ఉపాధ్యాయులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సోమవారం నిర్వహిస్తారు. ఎస్‌ఏ సాంఘిక శాస్త్రం, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయ కేటగిరీ వారికి మంగళవారం నిర్వహించనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని