ఉత్తమ ప్రతిభకు నగదు పురస్కారాలు
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

ఉత్తమ ప్రతిభకు నగదు పురస్కారాలు


ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మతో ప్రశంసాపత్రాలు అందుకున్న సిబ్బంది

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసు శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి సేవలందించటం అభినందనీయమని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీసుస్టేషన్‌ల పరిధిలో కేసుల చేదన, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన పోలీసు అధికారులకు, పోలీసులకు ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏలూరు గ్రామీణ స్టేషన్‌లో ఎస్సై చావా సురేష్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సువర్ణరాజు, పెదపాడు కానిస్టేబుల్‌ నాగరాజు, హోంగార్డు చారువాక, పెదవేగి స్టేషన్‌లో ఎస్సై టి.సుధీర్‌, కానిస్టేబుల్స్‌ సీహెచ్‌ సుధీర్‌, ఎం.కిషోర్‌, ఎం.సురేష్‌, విజయ్‌కుమార్‌, హోంగార్డు జయప్రకాష్‌, కొవ్వూరులో కానిస్టేబుల్స్‌ కె.వెంకటేశ్వరరావు, సీహెచ్‌ రాజేశ,్‌ తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ వి.రవికుమార్‌, పెంటపాడు ఎస్సై కె.చంద్రశేఖర్‌, కానిస్టేబుల్‌ ఎ.దుర్గాప్రసాద్‌, హోంగార్డులు కె.గంగాధరరావు, డి.వెంకటేశ్వరరావు, పాలకొల్లు టౌన్‌ ఎస్సై నాగముత్యాలరావు, పెనుగొండ ఎస్సై జి.రవికిరణ్‌, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎం.సాగర్‌బాబు, కానిస్టేబుల్‌ దిలీప్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌కానిస్టేబుల్స్‌ పీవీ సత్యనారాయణ, బి.రామకృష్ణ, పి.మధుసూదనరావు, ఆకివీడు హెడ్‌కానిస్టేబుల్‌ జి.సుబ్బారావులు నగదు పురస్కారాలు అందుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని