సీఎం ఒక్క మంచి పనీ చేయడం లేదు : చింతా
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

సీఎం ఒక్క మంచి పనీ చేయడం లేదు : చింతా

మాట్లాడుతున్న మోహన్‌

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్క మంచి పనీ చేయడం లేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు చింతా మోహన్‌ విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వకుండా ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించడం అత్యంత బాధాకరమని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం తన లక్ష్యమని తెలిపారు. 2024లో దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. ఏలూరులో శనివారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని చెప్పారు. దేశంలో భాజపా పాలనలో సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందని అన్నారు. కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం జిల్లా ఛైర్మన్‌ డి.జాన్‌ ప్రభాకర్‌, నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని