రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ దుర్మరణం
eenadu telugu news
Updated : 24/10/2021 13:42 IST

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ దుర్మరణం

దెందులూరు : దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాలీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సత్యనారాయణపురం నుంచి ఐస్‌లోడ్‌తో పోతునూర్‌ వెళ్తున్న లారీ.. 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉండ్రాజవరం వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు ఐరన్‌లోడుతో వెళ్తున్న ట్రాలీ ఢీ కొట్టింది. ట్రాలీ కేబిన్‌ ధ్వంసం కాగా, డ్రైవర్‌ అందులో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్‌ పోలీసులు, అంబులెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదస్థలిని పరిశీలించారు. డ్రైవర్‌ మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం క్రేన్ల సాయంతో డ్రైవర్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌కు చెందిన రాపోలు మల్లయ్య (43)గా గుర్తించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని