Updated : 27/01/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మిమ్మల్ని కోర్టుకు పిలవడం ఇబ్బందిగా ఉంది’

డీజీపీని ఉద్దేశిస్తూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు

అమరావతి: కోర్టు ధిక్కారం కేసులో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం శాఖ కార్యదర్శి, ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, ఏలూరు డీఐజీ ఇవాళ హైకోర్టుకు హాజరయ్యారు. ఎస్‌ఐ రామారావు తన పదోన్నతి విషయంలో గతంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పదోన్నతి జాబితాలో రామారావు పేరు చేర్చాలని పోలీసు శాఖను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ రామారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం శాఖ కార్యదర్శి, ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, ఏలూరు డీఐజీని కోర్టుకు హాజరుకావాలని గతంలో ఉత్తర్వుల జారీ చేసింది. మూడు నెలలు గడిచినా ఎస్సై రామారావు పదోన్నతి విషయంలో కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని డీజీపీని న్యాయస్థానం ప్రశ్నించింది. ‘మిమ్మల్ని ఇలా ప్రతిసారీ కోర్టుకు పిలవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది’ అని విచారణ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి..

నాదెండ్ల మనోహర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అనేక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని