మోసం చేసిన యువకుడిపై కేసు
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

మోసం చేసిన యువకుడిపై కేసు

కానూరు, న్యూస్‌టుడే: ఇనస్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు మాయమాటలు చెప్పి యువతి వద్ద నుంచి రూ.3 లక్షలు నగదు, బంగారు నగలు తీసుకుని మోసం బాధితురాలు ఫిరాదు చేయగా.. ఇదే ఘటనలో ఆ యువకుడిపై కొంతమంది దాడి చేశారని నిందితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కానూరుకు చెందిన యువతి(23)కి మూడు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన కె.నాగేంద్ర(24).. తన పేరు సూర్య అని చెప్పి పరిచయమయ్యాడు. తాను ఐబీఎం సాఫ్టువేర్‌ సంస్థల్లో ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలిపాడు. తనకు బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉందని, వాటిని డ్రా చేయాలంటే ముందుగా కొంత నమోదు డిపాజిట్‌ చేయాలని నమ్మించాడు. తనకు నగదు కావాలని అడగడంతో ఆమె రూ.లక్షన్నర మూడు విడతలుగా గూగుల్‌, ఫోన్‌పేల ద్వారా అతనికి పంపించింది. ఇంకా కావాలని అడిగితే.. అతనికి రూ.లక్షన్నర విలువైన బంగారు నగలు తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చింది. ఇలా నెల రోజుల క్రితం వరకు అతనికి రూ.3 లక్షలు విలువైన నగదు, బంగారు నగలు ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె నగదు, నగలు గురించి అడుగుతుంటే అతడు కాలపాయన చేస్తూ వచ్చాడు. అతని వ్యవహారంపై అనుమానం వచ్చి ఆరా తీయగా అతను పేరు సూర్య కాదని, నాగేంద్ర అని, అతనికి ఐబీఎంలో ఉద్యోగి కాదని తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాడి చేసిన ఘటనలో నలుగురి అరెస్టు

ఇదే ఘటనలో యువకుడిపై దాడి చేశారని కానూరుకు చెందిన వైకాపా నేత దేవభక్తుని చక్రవర్తితో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు సీఐ ముత్యాల సత్యనారాయణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నిందితుడు నాగేంద్ర.. తనను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆ యువతి స్థానిక వైకాపా నేత దేవభక్తుని చక్రవర్తిని ఆశ్రయించగా.. అతడు నాగేంద్రను పిలిచి డబ్బులు ఇవ్వాలని దండించారు. దీంతో చక్రవర్తితో పాటు, అరవింద్‌, రోషన్‌, బుజ్జిలు తనను విచక్షణ రాహిత్యంగా కొట్టారని యువకుడు నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆ నలుగురిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు శనివారం అరెస్టు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని