జగన్మాత సేవలో చాగంటి దంపతులు
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

జగన్మాత సేవలో చాగంటి దంపతులు


మండపంలో ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు దంపతులు, పక్కన ఈవో భ్రమరాంబ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ప్రముఖ ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు దంపతులు శనివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఆహ్వానించగా వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ వారికి అమ్మవారి చిత్రపటంతోపాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. పలువురు భక్తులు, దేవస్థానం ఉద్యోగులు చాగంటి ఆశీర్వచనం తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని