అగ్రి బీఎస్సీ (ఆనర్స్‌)లో 64 సీట్ల భర్తీ
eenadu telugu news
Published : 24/10/2021 05:53 IST

అగ్రి బీఎస్సీ (ఆనర్స్‌)లో 64 సీట్ల భర్తీ

అభ్యర్థికి సీటు కేటాయింపు పత్రాన్ని అందజేస్తున్న వీసీ విష్ణువర్దన్‌రెడ్డి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) 2021-22 విద్యా సంవత్సరంలో అగ్రి బీఎస్సీ (ఆనర్స్‌)లో ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటాలో 64 సీట్లు భర్తీ అయ్యాయి. శనివారం గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 96 సీట్లకు విద్యార్హతలు, ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్న 64 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. ఈ సందర్భంగా ఆంగ్రూ ఉప కులపతి డాక్టర్‌ విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా ఫీజును 8 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్లకు తగ్గించామన్నారు. అగ్రి బీఎస్సీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం అభ్యర్థులకు ఎంపిక పత్రాలను వీసీ అందజేశారు. రెండో విడత కౌన్సెలింగ్‌, ఇతర సమాచారం కోసం వర్శిటీ వెబ్‌సైట్‌ www.angrau.ac.in ని చూడాలని సూచించారు. కౌన్సెలింగ్‌ను వర్శిటీ పరీక్షల నియంత్రణ అధికారి సుధాకర్‌ నిర్వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ గిరిధర కృష్ణ, వ్యవసాయ ఇంజినీరింగ్‌ డీన్‌ యెల్లారెడ్డి, సంయుక్త రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని