బస్సు ఢీకొని అమృతలూరు వాసి మృతి
eenadu telugu news
Published : 24/10/2021 06:21 IST

బస్సు ఢీకొని అమృతలూరు వాసి మృతి


అవినాశ్‌బాబు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా అమృతలూరుకు చెందిన వి.అవినాశ్‌ బాబు(39) కూకట్‌పల్లి శాంతినగర్‌లో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నారు. సంగారెడ్డిలో ఓ ప్రైవేటు కంపెనీ సర్వీస్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇతను సర్వీస్‌ సెంటర్‌ మూసివేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. మియాపూర్‌లో వ్యాపార భాగస్వామిని దించి కూకట్‌పల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో జేఎన్‌టీయూ సిగ్నల్‌ దాటగానే ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. బస్సు వెనక చక్రాలు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని