బొండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేయాలి
eenadu telugu news
Published : 24/10/2021 06:21 IST

బొండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేయాలి


అరండల్‌పేట సీఐ నరేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్న వైకాపా నేతలు

పట్టాభిపురం (గుంటూరు), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని గుంటూరు నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, షేక్‌ సజీల గుంటూరు అరండల్‌పేట సీఐ నరేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఉమా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌కు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ను సీఐకు అందజేశారు. మేయర్‌ మనోహర్‌నాయుడు మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు కేంద్ర కార్యాలయంలో చేపట్టిన దీక్షలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి బొండా ఉమా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించారని, నానా దుర్భాషలాడారని, చంద్రబాబు చిటికేస్తే తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయాన్ని గంటలో నేలమట్టం చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. తక్షణమే ఉమాపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ నరేష్‌కుమార్‌ స్పందిస్తూ న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని