Published : 09/05/2021 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP: రేషన్‌ వాహనాలను వెనక్కిచ్చిన ఆపరేటర్లు

గుంతకల్లు: ఇంటి వద్దకు నిత్యావసరాలు పంపిణీ చేయలేమంటూ వాహనాల ఆపరేటర్లు తప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో 20 మంది వాహన ఆపరేటర్లలో 10 మంది తమ వాహనాలను తహసీల్దారు కార్యాలయంలో అప్పగించారు. తమకు వస్తున్న రూ.21 వేలు.. పెట్రోల్‌, వాహన ఈఎంఐ, హమాలీకే సరిపోతోందని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ కూడా అందడం లేదని ఆపరేటర్లు తెలిపారు. తమకొచ్చే జీతంలో ఏమీ మిగలట్లేదని.. వెట్టి చాకిరి చేయడం తప్ప ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాహనాలను తిరిగి ఇచ్చేశామని ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు. వాహనం తీసుకునే సమయంలో తాము రూ.70 వేల వరకు ఖర్చు పెట్టామని.. దాన్ని ఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటామని చెబుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని