ఆన్‌లైన్‌లో సత్యదేవుని వ్రతం
eenadu telugu news
Published : 26/09/2020 04:54 IST

ఆన్‌లైన్‌లో సత్యదేవుని వ్రతం

రేపటి నుంచి ప్రారంభించే అవకాశం

అన్నవరం, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు సత్యదేవుని వ్రత పూజను చేయించుకునేలా కొత్త సౌకర్యాన్ని అన్నవరం దేవస్థానం అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు వ్రత రుసుం ఆన్‌లైన్‌లో చెల్లిస్తే వారికి అధికారులు ప్రత్యేక యూట్యూబ్‌ లింక్‌ను పంపిస్తారు. దీని ద్వారా పురోహితులు చేసే పూజకు అనుగుణంగా ఇంట్లో స్వామి వ్రతం చేసుకునే అవకాశంతోపాటు దేవస్థానంలో జరిగే వ్రత పూజను ఆన్‌లైన్‌ ద్వారా వీక్షించే వీలుంది. కరోనా నేపథ్యంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నామని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ వ్రత పూజ కోసం రత్నగిరిపై ప్రత్యేకంగా స్టూడియో మాదిరిగా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ స్వామికి వ్రత పురోహితులు పూజ చేస్తుంటారు. దీన్ని కెమెరాల ద్వారా చిత్రీకరించి యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈవో త్రినాథరావు మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ వ్రతపూజ విధానం ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని