Crime news: జూబ్లీహిల్స్‌లో దారుణం: మహిళల బాత్‌రూమ్‌లో కెమెరా
eenadu telugu news
Updated : 23/09/2021 12:27 IST

Crime news: జూబ్లీహిల్స్‌లో దారుణం: మహిళల బాత్‌రూమ్‌లో కెమెరా

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్‌ ఫుడ్‌ కోర్టులో దారుణం చోటు చేసుకుంది. మహిళల బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరపడం కలకలం రేపింది. బాత్‌రూమ్‌లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను ఓ యువతి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం  వెలుగు చేసింది. రంగంలోకి దిగిన  పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిన్నంతా ఫోన్‌ కెమెరా ఆన్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాత్‌రూమ్‌ క్లీనర్‌గా పని చేసే బాలుడు ఫోన్‌ కెమెరా అమర్చినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని