సెల్‌ టవరెక్కి యువకుడి హల్‌చల్‌
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

సెల్‌ టవరెక్కి యువకుడి హల్‌చల్‌

 

మునిపల్లి, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారని ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మునిపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ అదే గ్రామానికి చెందిన మరో వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పదినెలల క్రితం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు గ్రామం నుంచి వెళ్లిపోయి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 15న ప్రవీణ్‌ కుమార్‌ ఇంట్లో లేనప్పుడు యువతి సోదరుడు గ్రామానికి వచ్చి తీసుకువెళ్లాడు. దీంతో తన భార్యను బలవంతంగా తీసుకువెళ్లారని బుధేరా పోలీస్టేషన్‌లో ప్రవీణ్‌ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టిన పోలీసులు యువతి తన తల్లిదండ్రుల వద్ద సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటానని చెప్పడంతో.. వీడియో చిత్రీకరించి యువకుడికి చూపించారు. దీంతో ఆవేదనకు గురైన ప్రవీణ్‌ సోమవారం టవర్‌పై ఎక్కి భార్యతో నేరుగా మాట్లాడించాలని డిమాండ్‌ చేశాడు. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, తన చావుకు యువతి కుటుంబ సభ్యులు, పోలీసులే కారణమని లేఖ కిందకు వేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అక్కడికి చేరుకొని అమ్మాయితో మాట్లాడిస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగి వచ్చాడు. గ్రామస్థులు సముదాయించి పంపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని