కార్గిల్‌ యుద్ధ వీరులకు నివాళి
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

కార్గిల్‌ యుద్ధ వీరులకు నివాళి


స్మారక స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న మేజర్‌ జనరల్‌ ఆర్‌కే సింగ్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: కార్గిల్‌ యుద్ధ వీరుల త్యాగాలు మరువలేనివని సైన్యాధికారులు అన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా సోమవారం పరేడ్‌ మైదానం ఆవరణలోని వీర సైనికుల స్మారక స్తూపం వద్ద తెలంగాణ ఆంధ్రా సబ్‌ ఏరియా(టాసా) జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌(జీవోసీ), మేజర్‌ జనరల్‌ ఆర్‌కే సింగ్‌ నివాళులర్పించారు. స్టేషన్‌ కమాండర్‌ బ్రిగేడియర్‌ అభిజిత్‌చంద్ర, 1ఈఎంఈ సెంటర్‌ కమాండెంట్‌ బ్రిగేడియర్‌ సరబ్‌జీత్‌సింగ్‌, ఏఓసీ సెంటర్‌ కమాండెంట్‌ బ్రిగేడియర్‌ అజిత్‌ దేశ్‌పాండే, రిటైర్డ్‌ లఫె్టినెంట్‌ జనరల్‌ సురేంద్రనాథ్‌ పాల్గొన్నారు.బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో విజయ్‌ దివస్‌ సందర్భంగా ప్రిన్సిపల్‌ స్మితాగోవింద్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు వర్చువల్‌గా పోటీలు పెట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని