చెరువు చూసేందుకొచ్ఛి.
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

చెరువు చూసేందుకొచ్ఛి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

శామీర్‌పేట, న్యూస్‌టుడే: చెరువును చూసేందుకు వచ్చి ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన శామీర్‌పేట ఠాణా పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. ఎస్సై రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని నాగోల్‌ ప్రాంతానికి చెందిన సాయిచరణ్‌ (26) తన కళాశాల మిత్రులతో కలిసి శామీర్‌పేట పెద్ద చెరువు చూడడానికి మధ్యాహ్నం వచ్చారు. సరదాగా గడిపారు. అనంతరం నలుగురు ఆటోలో, మరో నలుగురు ద్విచక్ర వాహనాలపై నాగోల్‌కు తిరుగుపయనమయ్యారు. శామీర్‌పేట ఇండియన్‌ బ్యాంకు సమీపంలో ఆటోలో ఉన్న సాయిచరణ్‌ మద్యం మత్తులో కిందకు దూకాడు. ఆ సమయంలో అలియాబాద్‌ వైపునకు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ కింద పడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని