సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

సంక్షిప్త వార్తలు

నగరంలో కొత్తగా 12 అన్నపూర్ణ కేంద్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎండలో నిల్చుని తినే పరిస్థితి లేకుండా.. అన్నపూర్ణ భోజన కేంద్రాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. అన్ని కేంద్రాలను ఆధునిక కెఫేల మాదిరి తయారు చేయాలని మంత్రి కేటీఆర్‌ ఇటీవల జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ శనివారం ట్విటర్‌లో ఆ విషయాన్ని ప్రకటించారు. కూకట్‌పల్లిలో రూపుదిద్దుకున్న కొత్త కేంద్రాన్ని, పురోగతిలోని మరో కేంద్రం నమూనాను ట్విటర్‌లో ఉంచారు. ప్రయోగాత్మకంగా 12 కేంద్రాలను అందుబాటులోకి తేనున్నామని తెలిపారు.


నేడు మ్యూజియానికి సెలవు

చార్మినార్‌, న్యూస్‌టుడే: నగరంలో గణేశ్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఆదివారం సాలార్‌జంగ్‌ మ్యూజియం మూసి ఉంటుందని ఆ మ్యూజియం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.నాగేందర్‌రెడ్డి తెలిపారు. సందర్శకులు సోమవారం నుంచి తిరిగి మ్యూజియాన్ని సందర్శించవచ్చని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని