విద్యార్థుల జీవితాలతో కార్పొరేట్‌ విద్యాసంస్థలు చెలగాటం
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

విద్యార్థుల జీవితాలతో కార్పొరేట్‌ విద్యాసంస్థలు చెలగాటం

ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి నోటీసు జారీ

దిల్‌సుఖ్‌నగర్‌: నిబంధనలు పాటించకుండా కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు పొనుగోటి అర్జున్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, హయత్‌నగర్‌ ప్రాంతాల్లోని శ్రీచైతన్య, నారాయణ, తపస్య జూనియర్‌ కళాశాలలను ఆయన ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశిస్తే అందుకు భిన్నంగా హాస్టళ్లు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గదుల్లో సామాజిక దూరం పాటించే విధంగా బల్లలు ఏర్పాటు చేయకపోగా, ఒకే గదిలో సుమారు 80 మంది విద్యార్థులను దగ్గరదగ్గరగా ఉంచి బోధిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈమేరకు కళాశాలల సిబ్బందిని ప్రశ్నించడంతో వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ఇంటర్‌ బోర్డు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్పొరేట్‌ కళాశాలల తీరు ఇష్టారాజ్యంగా ఉందన్నారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నిర్లక్ష్యం పట్ల కమిషన్‌ సభ్యులు నోటీసు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని