వెనుకబడిన కులాల సంక్షేమానికి కృషి
eenadu telugu news
Published : 19/09/2021 02:16 IST

వెనుకబడిన కులాల సంక్షేమానికి కృషి


వెదురు వస్తువులతో కృష్ణమోహన్‌రావు, సభ్యులు కిశోర్‌గౌడ్‌, ఉపేంద్ర, గౌతంరావు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: వెనుకబడిన కులాల సంక్షేమానికి ప్రభుత్వానికి సిఫారసులు చేస్తామని తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. రాష్ట్ర బీసీ జాబితాలో ఉన్న 130 కులాలకు అభివృద్ధి ఫలాలు అందేలా కమిషన్‌ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అంబర్‌పేట అలీకేఫ్‌ చౌరస్తాలోని కేతేశ్వర కల్యాణ మండపంలో జంటనగరాల మహేంద్ర (మేదరి) సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ మేదరల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కమిషన్‌ సభ్యులు కిశోర్‌గౌడ్‌, ఉపేంద్ర, భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, జోగులాంబ గద్వాల జిల్లా ఇన్‌ఛార్జి వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు లావణ్య, పద్మ, అమృత, ఉమారాణి, మేదర సంఘం నేత యాదగిరి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని