గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలి
eenadu telugu news
Published : 19/09/2021 02:16 IST

గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలి


భగవంత్‌రావును సన్మానిస్తున్న రితీశ్‌ జాగిర్దార్‌. చిత్రంలో ప్రతినిధులు

కాచిగూడ, న్యూస్‌టుడే: గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రభుత్వాన్ని కోరింది. శనివారం కాచిగూడలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో అఖిల భారత జైన్‌ మైనార్టీ కన్వీనర్‌ రితీశ్‌ జాగిర్దార్‌, అఖిల భారత హిందూ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌కే జైన్‌, జైన్‌ రాజనీతి చేతనా మంచ్‌ కార్యదర్శి ముఖేశ్‌జైన్‌, అవినాశ్‌దేవ్‌డా, మహేందర్‌ వ్యాస్‌, శ్రీరామ్‌ వ్యాస్‌ భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావును సన్మానించారు. ఆయన మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన నేనపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని