వాగులో ఒకరి గల్లంతు
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

వాగులో ఒకరి గల్లంతు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ


పులుసుమామిడి వాగు వద్ద రెవెన్యూ సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: వికారాబాద్‌ మండలంలో పులుసుమామిడి వాగు వద్ద వ్యక్తి గల్లంతైన సంఘటన సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. రెవెన్యూ, పంచాయతీ అధికారులు వారిస్తున్నా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంతో వాగు దాటే ప్రయత్నం చేయడంతో కొట్టుకుపోయాడని అధికారుల తెలిపారు. ఈ సమాచారంతో ఎస్పీ నారా10 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో ఆ ప్రాంతంలో పరిశీలించినా ఆచూకీ లభించలేదు. వికారాబాద్‌కు తిరుగు పయనంలో అన్ని దారుల్లోనూ వాగులు పొంగడంతో ఎస్పీ, డీఎస్పీ వరదలో ఇరుక్కున్నట్లయింది. శివారెడ్డిపేట్‌ చెరువు అలుగు పొంగి దన్నారం-వికారాబాద్‌ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి, సిద్దులూరు మార్గంలో రావాలన్నా, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అవకాశం లేకపోయింది. పరిస్థితిని జిల్లా అదనపు ఎస్పీ రషీద్‌, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పరిశీలించి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని