ర్యాలీలు.. రాస్తారోకోలు
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

ర్యాలీలు.. రాస్తారోకోలు

భారత్‌ బంద్‌లో పాల్గొన్న అఖిల పక్షం నాయకులు

146 మంది ముందస్తు అరెస్టు


ధారూర్‌లో నిరసన తెలుపుతున్న నేతలు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 5 గంటల నుంచే కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు వికారాబాద్‌, తాండూరు, పరిగి బస్‌డిపోల వద్దకు చేరుకుని, బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అప్పటికే అక్కడ పహారాలో ఉన్న పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేసి, పోలీసుస్టేషన్‌కు తరలించారు. వికారాబాద్‌లో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, పరిగిలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో అఖిల పక్ష నాయకులు పట్టణ వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. ఉదయం 12 గంటల వరకు కొంత మంది వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు సహకరించారు. మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగాయి. భాజపా, తెరాస మినహా మిగతా రాజకీయ పార్టీల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 146 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. సాయంత్రం వారిని విడిచిపెట్టారు.


తాండూరు: వివిధ పార్టీల ఆధ్వర్యంలో..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని